కరోనా వ్యాప్తి భయంతో.. మూడు గ్రామాలకు సీల్..

| Edited By:

Jul 06, 2020 | 4:31 AM

కోవిద్-19 కట్టడికోసం అసోంలోని మూడు గ్రామాల్లో అధికారులు లాక్‌డౌన్ విధించారు. నాగాన్ జిల్లాలో ఇస్లాం మత బోధకుడి అంత్యక్రియలకు శనివారంనాడు వేలాది మంది జనం హాజరుకావడంతో అధికారులు

కరోనా వ్యాప్తి భయంతో.. మూడు గ్రామాలకు సీల్..
Follow us on

Officials lock down three villages: కోవిద్-19 కట్టడికోసం అసోంలోని మూడు గ్రామాల్లో అధికారులు లాక్‌డౌన్ విధించారు. నాగాన్ జిల్లాలో ఇస్లాం మత బోధకుడి అంత్యక్రియలకు వేలాది మంది జనం హాజరుకావడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. ఆల్ ఇండియా జమాయిత్ ఉలేమా అధ్యక్షుడు, ఈశాన్య ప్రాంత అమీర్-ఇ-షరియత్‌కు చెందిన 87 ఏళ్ల ఖైరుల్ ఇస్లాం అంత్యక్రియలు ఈనెల 2న జరిగాయి. దీంతో ఆయన అంత్యక్రియలకు వేలాది మంది జనం హాజరయ్యారు.

ఖైరుల్ ఇస్లాం కుమారుడు, ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాం ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో ఉంచడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మరోవైపు.. ఇస్లాం ప్రవక్త అంత్యక్రియల్లో 10,000 మందికి పైగా హాజరై ఉంటారని పోలీసులు అంచనా వేశారు. రెండు కేసులు కూడా నమోదు చేశారు. చుట్టపక్కల మూడు గ్రామాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు. తాజా గణాంకాల ప్రకారం అసోంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,000కు చేరింది.