వాగులో కొట్టుకుపోయిన డ్రైవర్.. హెలికాప్టర్‌తో గాలింపు

కోహెడ మండలం బస్వాపూర్‌ వద్ద జరిగింది. గల్లంతైన లారీ డ్రైవర్‌ కోసం అధికారులు గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం బస్వాపూర్‌ వద్ద లారీ వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదం నుంచి క్లీనర్‌ సురక్షితంగా...

వాగులో కొట్టుకుపోయిన డ్రైవర్.. హెలికాప్టర్‌తో గాలింపు

Updated on: Aug 15, 2020 | 3:57 PM

Lorry Driver Missing at Koheda : సిద్దిపేట జిల్లాలో జోరుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇలా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు ప్రయత్నించిన ఓ లారీ వరుదలో కొట్టుకు పోయింది. ఈ ప్రమాదం నుంచి లారీ క్లీనర్ సురక్షితంగా బయటపడగా.. డ్రైవర్ మాత్రం నీటిలో కొట్టుకు పోయాడు.

ఈ ఘటన కోహెడ మండలం బస్వాపూర్‌ వద్ద జరిగింది. గల్లంతైన లారీ డ్రైవర్‌ కోసం అధికారులు గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం బస్వాపూర్‌ వద్ద లారీ వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదం నుంచి క్లీనర్‌ సురక్షితంగా బయటపడగా, డ్రైవర్‌ నీటి ప్రవాహానికి కొట్టుకెళ్లి ఒక చెట్టును పట్టుకున్నాడు. మధ్యాహ్నం వరకు సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తూ ఎదురు చూశాడు. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు.. లారీ డ్రైవర్‌ను కాపాడాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

దీంతో..ఘటన స్థలానికి సీపీ జోయల్‌ డేవిస్‌ ఆధ్వర్యంలో రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి. చెట్టును పట్టుకుని ఉన్న డ్రైవర్‌ను కాపాడేందుకు ప్రయత్నించాయి. చెట్టును పట్టుకొని ఉన్న డ్రైవర్‌ను కాపాడేందుకు తాడు సాయంతో ప్రయత్నంచగా.. వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో డ్రైవర్ కొట్టుకుపోయాడు. దీంతో మరింత అప్రమత్తం అయిన అధికారులు వెంటనే హెలికాప్టర్ ద్వార గాలింపు చేపట్టారు. హెలికాప్టర్‌తో గాలింపు చేపట్టినా డ్రైవర్‌ ఆచూకీ లభ్యంకాలేదు. ప్రస్తుతం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం బోటు సాయంతో వాగులో గాలింపు చేస్తున్నారు.