ఒడిశాలో సైరాకు సెగ..

| Edited By:

Oct 01, 2019 | 8:28 PM

టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు.. వాటికి తోడు వివాదాలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. ఇప్పటికే పలు సినిమాల పట్ల వివాదాలు చోటుచేసుకున్నాయి. రిలీజ్‌కి ఒక్కరోజు ముందు వాల్మీకి మూవీకి టైటిల్‌ని ఛేంజ్ చేసి రిలీజ్ చేశారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన.. సైరా నరసింహారెడ్డి మూవీకి కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఈ సినిమా పట్ల కళింగ సేన పార్టీ నేతలు వ్యతిరేకిస్తూ సైరా పోస్టర్లను, చిరంజీవి […]

ఒడిశాలో సైరాకు సెగ..
Follow us on

టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు.. వాటికి తోడు వివాదాలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. ఇప్పటికే పలు సినిమాల పట్ల వివాదాలు చోటుచేసుకున్నాయి. రిలీజ్‌కి ఒక్కరోజు ముందు వాల్మీకి మూవీకి టైటిల్‌ని ఛేంజ్ చేసి రిలీజ్ చేశారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన.. సైరా నరసింహారెడ్డి మూవీకి కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఈ సినిమా పట్ల కళింగ సేన పార్టీ నేతలు వ్యతిరేకిస్తూ సైరా పోస్టర్లను, చిరంజీవి దిష్టి బొమ్మలను కాల్చేశారు. భువనేశ్వర్‌లో సైరా సినిమాను రిలీజ్ చేయబోతున్న శ్రీయ థియేటర్ వద్ద కళింగ సేన పార్టీ నిరసన తెలిపింది. చిరంజీవి దిష్టి బొమ్మలతో పాటు.. అమితాబ్ బచ్చన్ దిష్టిబొమ్మలు, చిత్ర పోస్టర్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.

సైరా దర్శకుడు దీన్ని తప్పుగా చిత్రీకరించి ఒడిశా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని.. కళింగసేన కార్యదర్శి బిజయ్ రాజ్ ఆరోపించారు. ఖుర్దా ప్రాంతం ప్రజలు పయికొ విప్లవం పేరిట తొలి పోరాటం చేశారు. దీనిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇక 2017లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా పయికొ విప్లవం తొలిదిగా ప్రకటించారు. కాబట్టి ఈ చిత్రాన్ని ఒడిశాలో రిలీజ్ చేయకుండా అడ్డుకుని తీరుతామని వారు హెచ్చరించారు. తమను అడ్డుకోవాలని చూస్తే.. ఆందోళనను ఉదృతం చేస్తామని చెబుతున్నారు.