రెండు కిలోల టమాటాల కోసం ఇద్దరు పిల్లల్ని తాకట్టు పెట్టాడు.. ఆఖరులో ట్విస్ట్ ఏంటంటే..

|

Aug 01, 2023 | 12:56 PM

కాసేపు దుకాణం ముందు నిలబెట్టి టమాటాలతో పారిపోయాడంటూ చిన్నారులు బోరుమంటున్నారు. అతను ఎవరో కూడా తమకు తెలియదని చెప్పాడు. కాసేపట్లో వస్తానని చెప్పి వెళ్లిపోయిన వ్యక్తి ఎంతకీ తిరిగి రాలేదు. దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఇలాంటి వింత ఘటన చర్చనీయాంశంగా మారింది. కొంత సేపటి తర్వాత దుకాణదారుడు పిల్లలతో మాట్లాడిన క్రమంలో అతడు చేసిన గేమ్‌ ప్లాన్‌ అర్థమైంది. ఆ ఇద్దరు పిల్లలను తాకట్టు పెట్టి రెండు కిలోల టమోటాలతో ఓ వ్యక్తి పరారయ్యాడని..పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

రెండు కిలోల టమాటాల కోసం ఇద్దరు పిల్లల్ని తాకట్టు పెట్టాడు.. ఆఖరులో ట్విస్ట్ ఏంటంటే..
Tomatoes
Follow us on

టమాటా ధరలు మరింత దారుణంగా పెరిగిపోతున్నాయి. ముట్టుకుంటేనే టమాటా భగ్గుమంటోంది. దీంతో పలుచోట్ల టమాటా దుకాణాల్లో చోరీలు, తోటల్లో లూటీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ చోట రెండు కిలోల టమాటాల కోసం ఓ వ్యక్తి ఇద్దరు చిన్నారులను తాకట్టుపెట్టిన వార్త సంచలనంగా మారింది. ఈ కేసు ఒడిశాలోని కటక్‌లోని ఛత్రబజార్ ప్రాంతంలో జరిగినట్టుగా తెలిసింది. అక్కడ ఒక వ్యక్తి టమాటాలు కొనడానికి కూరగాయల దుకాణానికి వచ్చాడు. ఇద్దరు పిల్లలను కాసేపు దుకాణం ముందు నిలబెట్టి..అనంతరం కావాల్సిన టమాటాలు కొనుగోలు చేసి వెళ్లిపోయాడు. కొంత సేపటి తర్వాత దుకాణదారుడు పిల్లలతో మాట్లాడిన క్రమంలో అతడు చేసిన గేమ్‌ ప్లాన్‌ అర్థమైంది. ఆ ఇద్దరు పిల్లలను తాకట్టు పెట్టి రెండు కిలోల టమోటాలతో ఓ వ్యక్తి పరారయ్యాడని..పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

కటక్‌లోని చత్రాబజార్ ప్రాంతానికి సంబంధించిన కేసులో.. ఒక వ్యక్తి టమోటాలు కొనడానికి కూరగాయల దుకాణానికి వెళ్లాడు. రెండు కిలోల టమోటాలు తీసుకుని ఇద్దరు పిల్లలను దుకాణం వద్ద నిలబెట్టి మరో పది కిలోలు టమాటా కొనాలనుకుంటున్నాను..వెళ్లి బ్యాగ్ తీసుకొస్తానని, వచ్చాక డబ్బులు చెల్లిస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అయితే, చాలా సేపటి వరకు కూడా ఆ వ్యక్తి తిరిగి రాకపోవడంతో దుకాణదారుడు పిల్లలను విచారించగా అసలు విషయం అర్థమైంది.

ఆ ఇద్దరు పిల్లలకు ఏదో పని కల్పిస్తానని, రూ.300 లు ఇస్తానని చెప్పిన సదరు వ్యక్తి ఆ ఇద్దరు పిల్లలను కూరగాయల దుకాణం వరకు తీసుకొచ్చాడని వాపోయారు. కానీ, వారితో ఏ పని చేయించలేదు. కాసేపు దుకాణం ముందు నిలబెట్టి టమాటాలతో పారిపోయాడంటూ చిన్నారులు బోరుమంటున్నారు. అతను ఎవరో కూడా తమకు తెలియదని చెప్పాడు. కాసేపట్లో వస్తానని చెప్పి వెళ్లిపోయిన వ్యక్తి ఎంతకీ తిరిగి రాలేదు. దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఇలాంటి వింత ఘటన చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..