కరోనా ఎఫెక్ట్.. ఆ రాష్ట్రంలో అన్ని పరీక్షలు రద్దు..

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన గ్రాడ్యుయేషన్, పీజీ కోర్సుల ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది.

కరోనా ఎఫెక్ట్.. ఆ రాష్ట్రంలో అన్ని పరీక్షలు రద్దు..

Updated on: Jun 12, 2020 | 12:46 PM

మాయదారి కరోనా కారణంగా విద్యావ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయింది. స్కూల్స్, విద్యాసంస్థలను ఎప్పుడు పునః ప్రారంభిస్తారో అన్న దానిపై క్లారిటీ లేకపోగా.. అన్ని రకాల పరీక్షలు సైతం రద్దవుతున్నాయి. కరోనా తీవ్రత దృష్ట్యా ఇప్పటికే తెలంగాణ, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ఒడిశా ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన గ్రాడ్యుయేషన్, పీజీ కోర్సుల ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. డిగ్రీ, పీజీ, బీటెక్‌తో పాటు అన్ని రకాల పరీక్షలను క్యాన్సిల్ చేస్తున్నట్లుగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా విద్యార్ధులను పైతరగతులకు ప్రమోట్ చేస్తామని ఒడిశా విద్యాశాఖ స్పష్టం చేసింది.