కేరళలో 5లక్షలు దాటిన కరోనా కేసులు

|

Nov 11, 2020 | 11:04 PM

దేశంలో కొవిడ్​ కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. దక్షిణాది రాష్టాల్లో వైరస్​ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది...

కేరళలో 5లక్షలు దాటిన కరోనా కేసులు
Follow us on

దేశంలో కొవిడ్​ కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. దక్షిణాది రాష్టాల్లో వైరస్​ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసుల ఆందోళన కలిగిస్తున్నాయి.

తాజాగా కేరళలో ఒక్కరోజులోనే 7,007 మంది కొవిడ్ బారినపడ్డారు. బాధితుల సంఖ్య 5,02,719కి చేరిందని అక్కడి వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు 29 మంది మృతితో పారాడి  ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,771కి ఎగబాకింది.