పాకిస్తాన్‌లో విజృంభిస్తున్న కరోనా…
ప్రపంచ దేశాలపై కరోనా కరాళ నృత్యం చేస్తోంది. సగటున రోజుకు సుమారు 5లక్షల చొప్పున వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు 5.19కోట్ల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. వారిలో 12.82లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచ దేశాలపై కరోనా కరాళ నృత్యం చేస్తోంది. సగటున రోజుకు సుమారు 5లక్షల చొప్పున వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు 5.19కోట్ల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. వారిలో 12.82లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 3కోట్ల 64లక్షల మందికిపైగా మహమ్మారిని జయించారు. 74లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి.
అయితే కరోనా కేసుల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటివరకు 1.05కోట్ల కేసులు నమోదయ్యాయి. వారిలో 2.45 లక్షల మందికిపైగా మరణించారు. ఇక నేపాల్లో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజులోనే 2,736 మంది కరోనా బారినపడ్డారు. బాధితుల సంఖ్య 2లక్షలకు సమీపించింది. మరో 22 మరణాలతో.. మృతుల సంఖ్య 1,148కి చేరింది.
పాకిస్తాన్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1,637 మందికి వైరస్ ఉన్నట్టు అక్కడి వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఫలితంగా బాధితుల సంఖ్య 3లక్షల 47వేల 476కు చేరింది. మరో 23 మంది మృతిచెందడం వల్ల.. ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 7వేలకు చేరింది.