హరిద్వార్ కుంభమేళాలో మొదటిసారిగా ఎన్ ఎస్ జీ కమెండోలతో అత్యంత భద్రత, ఉత్తరాఖండ్ పోలీసుల పహరా.
హరిద్వార్ లో గురువారం నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానుంది. లక్షలమంది భక్తులు, యాత్రికులు రానున్న ఈ కుంభమేళాలో సంఘ వ్యతిరేక శక్తులు, అరాచకవాదులు..

Haridwar Kumbha Mela 2021: హరిద్వార్ లో గురువారం నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానుంది. లక్షలమంది భక్తులు, యాత్రికులు రానున్న ఈ కుంభమేళాలో సంఘ వ్యతిరేక శక్తులు, అరాచకవాదులు ప్రవేశించకుండా తొలిసారి ఎన్ ఎస్ జీ కమెండోలను మోహరిస్తున్నారు. ఉత్తరాఖండ్ పోలీసులు కూడా వీరికి సహకరించనున్నారు. నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ కమెండో విభాగం అధికారులు నిన్న డెహ్రాడూన్ సందర్శించి దీనిపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. అటు.. కరోనా వైరస్ నేపథ్యంలో ఇది ఈ మేళాలో వ్యాప్తి చెందకుండా చూసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సమగ్ర కార్యాచరణను తెలియజేయాలని ఉత్తరాఖండ్ హైకోర్టు అధికారులను ఆదేశించింది. శుక్రవారం లోగా ఈమేరకు ఒక నివేదిక సమర్పించాలని సూచించింది.
అటు-గంగానదీ తీరం నిన్నటినుంచే మెల్లగా భక్తులతో నిండుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు, భక్తులు హరిద్వార్ చేరుకుంటున్నారు.