ఎయిర్ బబూల్ అగ్రిమెంట్: గోవా నుంచి లండన్‌కు డైరెక్ట్ ఫ్లైట్

గోవా నుంచి లండన్‌కు డైరెక్ట్ విమాన సర్వీసును ఆదివారం గోవా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ స్టార్ట్ చేసింది. ఎయిర్ బబూల్ అగ్రిమెంట్ కింద ఇక నుంచి వారానికో విమానం....

  • Ram Naramaneni
  • Publish Date - 6:34 pm, Mon, 19 October 20
ఎయిర్ బబూల్ అగ్రిమెంట్: గోవా నుంచి లండన్‌కు డైరెక్ట్ ఫ్లైట్

గోవా నుంచి లండన్‌కు డైరెక్ట్ విమాన సర్వీసును ఆదివారం గోవా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ స్టార్ట్ చేసింది. ఎయిర్ బబూల్ అగ్రిమెంట్ కింద ఇక నుంచి వారానికో విమానం గోవా నుంచి లండన్‌కు వెళ్లనున్నట్టు గోవా అంతర్జాతీయ విమానాశ్రయం సోషల్ మీడియా ద్వారా తెలిపింది. నవంబర్ నుంచి ఈ సంఖ్యను ఒకటి నుంచి రెండుకు పెంచనున్నట్టు వెల్లడించింది. కాగా.. కోవిడ్ నేపథ్యంలో మార్చి చివర్లో సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రకాల విమాన సేవలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కొద్ది నెలల క్రితం డొమెస్టిక్ ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను కొనసాగుతున్నాయి. అయితే ఒక్కో దేశంతో ఎయిర్ బబూల్ అగ్రిమెంట్ కుదుర్చుకుని ఆయా దేశాలకు మాత్రం విమాన సేవలను తిరిగి ప్రారంభిస్తోంది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.

Also Read :