Uttarakhand Glacier Outburst: చమోలీ డిజాస్టర్ కి కారణాలు ఎన్నో ! మన ‘స్వయం కృతాపరాధం’ ! మానవ తప్పిదం కూడా !

| Edited By: Pardhasaradhi Peri

Feb 08, 2021 | 12:07 PM

ఉత్తరాఖండ్ లో సంభవించిన ప్రకృతి వైపరీత్యానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం పర్యావరణ పరంగా కలిగిన ముప్పే కాదని, ఇందులో మానవ తప్పిదం కూడా..

Uttarakhand Glacier Outburst: చమోలీ డిజాస్టర్ కి కారణాలు ఎన్నో ! మన  స్వయం కృతాపరాధం ! మానవ తప్పిదం కూడా !
Follow us on

 Uttarakhand Glacier Outburst: ఉత్తరాఖండ్ లో సంభవించిన ప్రకృతి వైపరీత్యానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం పర్యావరణ పరంగా కలిగిన ముప్పే కాదని, ఇందులో మానవ తప్పిదం కూడా ఉందని నిపుణులు భావిస్తున్నారు. కొండ  శిఖరాలను పేల్చివేయడం, రిషిగంగా, ధౌలి గంగా నదులవద్ద రెండు డ్యామ్ ల నిర్మాణంకోసం టన్నెల్స్ (సొరంగాలు) తవ్వడం కూడా ఇందుకు కారణాలుగా కనబడుతోందని అంటున్నారు. ఇక్కడ క్వారీల తవ్వకాలు దాదాపు సంవత్సరమంతా కొనసాగుతుంటాయి. దీన్ని నివారించాలని పర్యావరణ వేత్తలు, నిపుణులు చేస్తున్న హెచ్చరికలు బుట్టదాఖలవుతున్నాయి. ఇక గ్లేసియర్ ఔట్ బరస్ట్ ఈ ముప్పును మరింత పెంచుతోంది.

ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా..సెంట్రల్ హిమాలయా క్యాచ్ మెంట్ ఏరియాలోని హిమానదులతో నిండి ఉంటుంది. ఈ గ్లేసియర్స్ పేలిపోవడం ఈ శతాబ్దపు మొదటి 20 సంవత్సరాల్లో రెట్టింపు అయిందని ఓ అంచనా..1975-2000 సంవత్సరాలతో పోలిస్తే..2000 లో గ్లేసియర్ మెల్టింగ్ చాలావరకు పెరిగిందని అంటున్నారు. నిజానికి హిమాలయా గ్లేసియర్స్ పై ఇస్రో ఇదివరకే డేటాను సేకరించి ప్రచురించింది.చమోలీ జిల్లాల్లో ఇప్పటికే 16 డ్యామ్ లు ఉండగా మరో  13 నిర్మాణ దశల్లో ఉన్నాయి. 2013 లో ఇలాంటి ఉత్పాతమే కేదార్ నాథ్ లో జరిగింది. నాటి జలప్రళయంలో సుమారు 3 వేలమంది ప్రాణాలు కోల్పోగా, అనేకమంది జాడ తెలియకుండా పోయింది.

 

Also Read:

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తప్పదా..? నిజంగానే తీర్చలేనంత అప్పుల్లో కూరుకుపోయిందా..? కేంద్రం ప్లాన్‌ ఏంటి..?

Guava Health Benefits: జామతో బోలెడు ప్రయోజనాలు.. క్రమం తప్పకుండా తీసుకుంటే ఎలాంటి లాభాలంటే..