
ప్రజలు ఎగ్జిట్ పోల్స్ కోసం కాకుండా ఎగ్జాక్ట్ పోల్స్ కోసం ఎదురు చూడాలన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కులం, మతం, ధనం ప్రధానం కాదనే అంశంపై ప్రజల్లో చర్చ జరగాలని తెలిపారు. ఉపరాష్ట్రపతి పదవికి చురుకుదనాన్ని తెచ్చి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని ఆయన చెప్పారు. గుంటూరులో జరిగిన ఆత్మీయ సభలో ఆయన పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రారంభించిన శాంతి విద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన తొలి భారతీయుడైన వెంకయ్యకు ఈ సభ అభినందనలు తెలిపింది.