ధరణిలో మొదలైన వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు..స్లాట్లు బుక్‌ చేసుకున్న బిల్డర్లు, డెవలపర్లు..తొలి రోజు ఆదాయం ఎంతంటే..!

|

Dec 12, 2020 | 7:32 AM

ఇందులో భాగంగా ధరణిలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. రూ. 200 చెల్లించి మీసేవ కేంద్రాల్లో స్లాట్లు బుక్‌ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రిజిస్ట్రేషన్ల శాఖలో తొలి రోజు..

ధరణిలో మొదలైన వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు..స్లాట్లు బుక్‌ చేసుకున్న బిల్డర్లు, డెవలపర్లు..తొలి రోజు ఆదాయం ఎంతంటే..!
Follow us on

Non-Agricultural Registration : తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షురూ అయింది. సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో అడ్వాన్స్‌ స్లాట్‌బుక్సింగ్‌ మొదలయ్యాయి. అయితే రోజుకు 24 స్లాట్స్‌ మాత్రమే బుక్‌ చేసుకోవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఇందులో భాగంగా ధరణిలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. రూ. 200 చెల్లించి మీసేవ కేంద్రాల్లో స్లాట్లు బుక్‌ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రిజిస్ట్రేషన్ల శాఖలో తొలి రోజు 4,143 లావాదేవీలు జరిగాయి. స్లాట్ల బుకింగ్‌ ద్వారా ఇప్పటివరకు రూ. 85 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

బిల్డర్లు, డెవలపర్ల కోసం పోర్టల్‌లో ప్రత్యేక విండో ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 451 మంది బిల్డర్లు 93 వేలకు పైగా కొత్త ఆస్తులను అప్‌లోడ్‌ చేశారు. రూ.12,699 టిపిన్స్‌ను స్థానిక సంస్థలు కేటాయించాయి. పోర్టల్‌ ద్వారా సులువుగా డాక్యుమెంట్‌ కూడా తయారు చేసుకునే అవకాశముంది.

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియను శుక్రవారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే.