డయాలసిస్‌కు నీళ్ల కొరత..
ప్రజారోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అయితే సూర్యాపేట జిల్లాలో ఉన్న రోగులకు కొత్త సమస్య వచ్చిపడింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 800 మంది వరకు డయాలసిస్ చేయించుకునే బాధితులు ఉన్నారు. అందులో 300 మంది రోజు విడిచి రోజుల ఈప్రక్రియను చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే 150 మంది వారానికి ఒకసారి డయాలసిస్ చేయించుకుంటున్నారు. కిడ్నీ రోగుల కోసం హూజూర్‌నగర్ ఏరియా హాస్పిటల్‌లో గల డయాలసిస్ […]
ప్రజారోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అయితే సూర్యాపేట జిల్లాలో ఉన్న రోగులకు కొత్త సమస్య వచ్చిపడింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 800 మంది వరకు డయాలసిస్ చేయించుకునే బాధితులు ఉన్నారు. అందులో 300 మంది రోజు విడిచి రోజుల ఈప్రక్రియను చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే 150 మంది వారానికి ఒకసారి డయాలసిస్ చేయించుకుంటున్నారు.
కిడ్నీ రోగుల కోసం హూజూర్‌నగర్ ఏరియా హాస్పిటల్‌లో గల డయాలసిస్ సెంటర్ ఇప్పుడు నీటి కొరతతో అవస్థలు పడుతోంది. ఈ కేంద్రంలో రోజుకు 40 మంది కిడ్ని రోగులకు డయాలసిస్ చేయాలి. దీనికోసం రోజు 13 వేల లీటర్ల నీరు అవసరమవుతుంది. ఈ నీటి కొరతతో కేవలం రోజుకు 20 మందికి మాత్రమే వైద్యసేవలు అందిస్తున్నారు. అయితే నీటి కొరత కారణంగా డయాలసిస్ సేవలు నిలిచిపోవడంపై రోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.