ఆస్ట్రేలియా సిరీస్.. క్వారంటైన్ కుదింపు కష్టమే.!
ఐపీఎల్ 2020 తర్వాత భారత ఆటగాళ్ల షెడ్యూల్ బిజీగా ఉండనుంది. నవంబర్ 10వ తేదీన ఐపీఎల్ ఫైనల్ అనంతరం భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ జరగనుంది.

India And Australia Series: ఐపీఎల్ 2020 తర్వాత భారత ఆటగాళ్ల షెడ్యూల్ బిజీగా ఉండనుంది. నవంబర్ 10వ తేదీన ఐపీఎల్ ఫైనల్ అనంతరం భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ జరగనుంది. ఇందులో భాగంగా ఇండియన్ ప్లేయర్స్ ఆస్ట్రేలియా పర్యటించనున్నారు. అక్కడ నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్నారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత భారత ఆటగాళ్లు రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.
అయితే సిరీస్ ప్రారంభించే ముందు వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ అవసరమని.. 2 వారాల క్వారంటైన్ వ్యవధిని తగ్గించాలని క్రికెట్ ఆస్ట్రేలియాను బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కోరాడు. దానికి సీఏ అసలు ఒప్పుకోవడం లేదు. ప్లేయర్స్ బస చేయనున్న బ్రిస్సేన్‌లో కరోనా నిబంధనలు కఠినంగా ఉన్నాయని.. తప్పనిసరిగా రెండు వారాల క్వారంటైన్ పాటించాలని సీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా, డిసెంబర్ 3వ తేదీ నుంచి ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానుంది.
Also Read:
