వాహనదారులకు అలర్ట్: నో మాస్క్ – నో పెట్రోల్!

No mask no fuel: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా మారిన అరుణాచల్‌ప్రదేశ్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులు ధరించకుండా వచ్చే వారికి పెట్రోలు పోయవద్దని రాజధాని ఇటానగర్‌లోని అన్ని పెట్రోలు బంకులను ఆదేశించింది. ఈ మేరకు జిల్లా ఆహార, పౌరసరఫరాల అధికారి (డీఎఫ్‌సీఎస్ఓ) అమిత్ బెంగియా అన్ని ఫ్యూయల్ స్టేషన్లకు నోటీసు జారీ చేశారు. కాగా.. రాజధాని ప్రజల […]

వాహనదారులకు అలర్ట్: నో మాస్క్ - నో పెట్రోల్!

Edited By:

Updated on: Apr 27, 2020 | 5:52 PM

No mask no fuel: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా మారిన అరుణాచల్‌ప్రదేశ్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులు ధరించకుండా వచ్చే వారికి పెట్రోలు పోయవద్దని రాజధాని ఇటానగర్‌లోని అన్ని పెట్రోలు బంకులను ఆదేశించింది. ఈ మేరకు జిల్లా ఆహార, పౌరసరఫరాల అధికారి (డీఎఫ్‌సీఎస్ఓ) అమిత్ బెంగియా అన్ని ఫ్యూయల్ స్టేషన్లకు నోటీసు జారీ చేశారు.

కాగా.. రాజధాని ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఫేస్ మాస్కులు ధరించకుండా వచ్చే వినియోగదారులకు ఇంధనం కానీ, ఎల్పీజీ సిలిండర్లు కానీ కొనుగోలుకు అనుమతించబోమని బెంగియా తెలిపారు. ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా ట్విట్టర్ ద్వారా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఇటానగర్‌లో ‘నో మాస్క్-నో ప్యూయల్’ విధానాన్ని అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

[svt-event date=”27/04/2020,5:26PM” class=”svt-cd-green” ]

Also Read: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్లకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు..