
No Lockdown In Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని పలు నగరాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడలో ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తారంటూ పలు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. దీనిపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్పందించారు.
సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న వార్త నిరాధారమైనదని కలెక్టర్ వెల్లడించారు. ఇటువంటి నిరాధారమైన వార్తలతో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని తెలిపారు. విజయవాడలో ఎలాంటి లాక్ డౌన్ లేదని స్పష్టం ఆయన స్పష్టం చేశారు. ఇక గత నెలలో కూడా ఇలానే 26వ తేదీ నుంచి వారం రోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించాలని కలెక్టర్ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు ఇవ్వగా.. అనూహ్యంగా కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్న సంగతి విదితమే.
Also Read:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి నెల రోజుల హోం క్వారంటైన్..