సెప్టెంబర్ 2 నుంచి ఈ-పాస్‌ అవసరం లేదు: మహారాష్ట్ర

|

Sep 01, 2020 | 2:00 PM

స్తంభించిన వ్యాపారాలను పునురుద్దరణలో భాగంగా నేటి నుంచి అన్‌లాక్‌ 4 సడలింపులు అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర హోం శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. మహారాష్ట్రలో జిల్లాల మధ్య రాకపోకలు సాగించేందుకు ఇప్పటివరకూ తప్పనిసరి చేసిన ఈ-పాస్‌.. సెప్టెంబర్ 2 నుంచి అవసరం లేదని మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు.

సెప్టెంబర్ 2 నుంచి ఈ-పాస్‌ అవసరం లేదు: మహారాష్ట్ర
Follow us on

దేశవ్యాప్తంగా కరోనా మహహ్మరి విజృంభణ కొనసాగుతూనే ఉంది. లాక్ డౌన్ కారణంగా వర్తక వాణిజ్య పూర్తిగా కుదేలైంది. స్తంభించిన వ్యాపారాలను పునురుద్దరణలో భాగంగా నేటి నుంచి అన్‌లాక్‌ 4 సడలింపులు అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర హోం శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. మహారాష్ట్రలో జిల్లాల మధ్య రాకపోకలు సాగించేందుకు ఇప్పటివరకూ తప్పనిసరి చేసిన ఈ-పాస్‌.. సెప్టెంబర్ 2 నుంచి అవసరం లేదని మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. అంతేకాదు, అన్‌లాక్‌4 సడలింపుల్లో భాగంగా సెప్టెంబర్ 2 నుంచి మహారాష్ట్రలో హోటళ్లు, లాడ్జిలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి.

అయితే.. మహారాష్ట్రలో మెట్రో రైలు సేవల ఎప్పటి నుంచి అందుబాటులోకి రానున్నాయో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. కాగా, మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్జీసీ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. దీంతో.. కార్యకలాపాలకు అనుమతినిచ్చే విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 1,94,056 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.