తెలుగువాడికి సున్నా.. మళయాళికి రూ. 36 లక్షలు.. ఇదెక్కడి న్యాయం..

| Edited By:

Aug 02, 2019 | 10:53 AM

సౌదీలోని తాయిఫ్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన కేరళకు చెందిన అబూబాకర్‌ కోయా కుటుంబానికి రూ.36.15 లక్షల పరిహారం ఆ రాష్ట్ర ప్రభుత్వం అందించింది. కాని తెలంగాణ సిద్దిపేట జిల్లాలోని సీతారాంపల్లికి చెందిన కుక్కల శ్రీనివాస్‌ కూడా ఇక్కడే ఓ రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. కాని ఆయన కుటుంబానికి ఒక్క పైసా కూడా పరిహారం అందించలేదు. గల్ఫ్‌ దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో ఇరు పక్షాల పొరపాటు, నిర్లక్ష్యం శాతాన్ని ప్రమాదం జరిగిన […]

తెలుగువాడికి సున్నా.. మళయాళికి రూ. 36 లక్షలు.. ఇదెక్కడి న్యాయం..
Follow us on

సౌదీలోని తాయిఫ్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన కేరళకు చెందిన అబూబాకర్‌ కోయా కుటుంబానికి రూ.36.15 లక్షల పరిహారం ఆ రాష్ట్ర ప్రభుత్వం అందించింది. కాని తెలంగాణ సిద్దిపేట జిల్లాలోని సీతారాంపల్లికి చెందిన కుక్కల శ్రీనివాస్‌ కూడా ఇక్కడే ఓ రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. కాని ఆయన కుటుంబానికి ఒక్క పైసా కూడా పరిహారం అందించలేదు. గల్ఫ్‌ దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో ఇరు పక్షాల పొరపాటు, నిర్లక్ష్యం శాతాన్ని ప్రమాదం జరిగిన స్థలంలో లభించిన సాక్ష్యాల ఆధారంగా నిర్ధారిస్తారు. కేరళకు చెందిన కోయా మృతి విషయానికొస్తే.. ప్రమాదంలో ఆయన నిర్లక్ష్యం, పొరపాటు 25 శాతం ఉందని నివేదిక ద్వారా తెలిసింది. తెలంగాణకు చెందిన శ్రీనివాస్‌, మల్లేశం, గణేశ్‌ల విషయాలకొస్తే.. ప్రమాదంలో వారి నిర్లక్ష్యం, పొరపాటు 100 శాతం ఉందని ట్రాఫిక్‌ పోలీసులు తేల్చడంతో పరిహారం దక్కలేదు.