మోదీ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగుల ఆశలపై నీళ్లుజల్లింది. వరాలు ఉంటాయని ఆశించిన వీరికి మరింత వడ్డింపు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను శ్లాబ్‌ల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఉద్యోగులు సహా పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శ్లాబ్‌లను కేంద్రం తగ్గిస్తుందని అంచనా వేశారు. అయితే ఇప్పుడు వారికి నిరాశ మిగిలింది. కేంద్ర ప్రభుత్వం ఇంతటితో ఆగకుండా సర్ చార్జీలను పెంచింది. రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్యలో పన్ను ఆదాయం కలిగిన వారు ఇకపై పన్నుపై 3 శాతం ఎక్కువ సర్‌చార్జీ చెల్లించాల్సి వస్తుంది. అదే ఏడాదిలో రూ.5 కోట్లపైన పన్ను ఆదాయం ఉంటే ఏకంగా 7 శాతం ఎక్కువ సర్‌చార్జీ కట్టాల్సి ఉంటుంది.
Finance Minister Nirmala Sitharaman: The budget has been presented with a 10-year vision in mind. The startups are being given a whole set of tax benefits #Budget2019 pic.twitter.com/LCZLE9fp9Q
— ANI (@ANI) July 5, 2019