మరో రెండు రోజులు ఆగండి

కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ కు ఊరట లభించింది. పైలట్‌కు మద్దతుగా నిలిచిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు చర్యలను మంగళవారం వరకు నిలిపివేయాలంటూ...

మరో రెండు రోజులు ఆగండి

Updated on: Jul 17, 2020 | 10:39 PM

No Action Against Sachin Pilot Till Tuesday : కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ కు ఊరట లభించింది. పైలట్‌కు మద్దతుగా నిలిచిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు చర్యలను మంగళవారం వరకు నిలిపివేయాలంటూ స్పీకర్ సీపీ జోషిని రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది.

అధిష్టానం తనకు అనర్హత నోటీసు పంపడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అనర్హత వేటు నోటీసులకు స్పందించాల్సిందిగా స్పీకర్ జోషి విధించిన గడువు ముగియడానికి కొన్ని నిమిషాల ముందు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.