నిర్భయ కేసులో నిందితుడు అక్షయ్‌కుమార్ సింగ్.. సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. తనకు విధించిన ఉరి శిక్షపై పునఃసమీక్షించాలని కోరుతూ.. నిర్భయ కేసు దోషి అక్షయ్ కుమార్ సింగ్ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. ఢిల్లీలోని ఉన్న జల, వాయు కాలుష్యంతో ఇప్పటికే చస్తున్నా.. ఇప్పటికే నా ఆయుష్షు తగ్గిపోయింది.. అంటూ అక్షయ్ కుమార్ సింగ్ పిటిషన్ వేశాడు. కాగా.. గతంలో ట్రయల్ కోర్టు విధించిన ఉరిశిక్షను ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టు సమర్థించాయి.
నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, ఆమె హత్యకు కారణమైన నేరస్థుల క్షమాభిక్ష పిటీషన్‌ను రాష్ట్రపతి రిజెక్ట్ చేశారు. దీంతో.. నలుగురు నిందితులకు కోర్టు విధించిన ఉరి శిక్ష అమలు కానుంది. ఈ నెల 16న ఉదయం 5 గంటలకు తీహార్ జైలు అధికారులు ఈ మృగాళ్లకు ‘ఉరి శిక్ష’ను అమలు చేయనున్నారు. ఈ కారణంగా.. ఇప్పుడు అమర్‌సింగ్ సుప్రీంని ఆశ్రయించాడు.
2012 డిసెంబర్ 16న మృగాళ్లు నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన ఆమె స్నేహితుడిని గాయపరిచి, అత్యంత హేయంగా ఢిల్లీ విధుల్లో బస్సులో తిప్పుతూ ఆమెను చెరపట్టారు. ఇప్పటికి ఏడేళ్లు అయినా.. నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదు. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ అనంతరం.. నిర్భయ కేసు గురించి దేశ వ్యాప్తంగా చర్చకు తావులేపింది.