ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోన్న వేళ కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ప్రెస్ మీట్లు పెద్దగా పెట్టకపోయినా సోషల్ మీడియా వేదికగా నాయకులు చెలరేగిపోతున్నారు. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ట్విట్టర్ లో వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
నడిరోడ్డుపై జగన్ బొమ్మ గీసిన కొందరి ఫోటోను ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. కరోనా వైరస్ పై పోరాటం చేస్తోన్న ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ వాళ్లు చేస్తున్న ఇలాంటి పనులు సిగ్గుచేటన్నారు. లాక్ డౌన్ అమలులో ఉన్నప్పుడు ఇలాంటి వాటికి పోలీసులు ఎలా పర్మిషన్ ఇస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై కొందరు నెటిజన్లు చినరాజప్పకు మద్దతు తెలపగా… మరికొందరు మాత్రం ఈ ఫోటో అసలు ఎప్పటిదో తెలుసుకోని పోస్ట్ చేసి ఉండాల్సిందని చురకలు అంటిస్తున్నారు.
మరోవైపు ఏపీలో కరోనా ప్రజలపై విరుచుకుపడుతుంది. తాజాగా కేసుల సంఖ్య 1097కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 31 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు.
This is such a shame on these Ycpians to do such activities during these crucial times of the fight on Carona.
Why are the police giving permission during the lockdown??? #YCPcovIDIOTS pic.twitter.com/ZQ29Ym1625
— Nimmakayala Chinarajappa (@ChinarajappaN) April 26, 2020