కాంగ్రెస్ నేత నింబాల్కర్ హత్య కేసులో.. కోర్టుకు అన్నాహజారే..!

| Edited By:

Jul 10, 2019 | 11:10 AM

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే 2006లో జరిగిన కాంగ్రెస్ నేత పవన్ రాజే నింబాల్కర్ హత్య కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో హజారే సాక్షిగా హాజరు కాగా, ఆయన వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసింది. కేసులో నిందితులైన ఎన్సీపీ మాజీ ఎంపీ పదన్ సిన్హ్ పాటిల్ సైతం ప్రత్యేక న్యాయమూర్తి ఏఎల్ యవాల్కర్ ముందు హాజరయ్యారు. నవీ ముంబైలోని కలామ్‌బోలి ప్రాంతంలో 2006 జూన్‌లో నింబాల్కర్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో హజారేను […]

కాంగ్రెస్ నేత నింబాల్కర్ హత్య కేసులో..  కోర్టుకు అన్నాహజారే..!
Follow us on

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే 2006లో జరిగిన కాంగ్రెస్ నేత పవన్ రాజే నింబాల్కర్ హత్య కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో హజారే సాక్షిగా హాజరు కాగా, ఆయన వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసింది. కేసులో నిందితులైన ఎన్సీపీ మాజీ ఎంపీ పదన్ సిన్హ్ పాటిల్ సైతం ప్రత్యేక న్యాయమూర్తి ఏఎల్ యవాల్కర్ ముందు హాజరయ్యారు. నవీ ముంబైలోని కలామ్‌బోలి ప్రాంతంలో 2006 జూన్‌లో నింబాల్కర్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో హజారేను సాక్షిగా చేర్చాలంటూ నింబాల్కర్ భార్య ఆనంది దేవి విచారణ కోర్టును ఆశ్రయించారు. అయితే హజారే ప్రత్యక్ష సాక్షి కారంటూ ఆమె విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు, హైకోర్టు ఉత్తర్వును పక్కనబెట్టిన అత్యున్నత న్యాయస్థానం ఈ కేసులో హజారే వాంగ్మూలాన్ని రికార్డు చేయమని సీబీఐని ఆదేశించింది. పదంసిన్హ్ తనను చంపుతానని బెదరించారంటూ 2002లో అన్నా హజారే ఆరోపణలు చేశారు.