నిహారిక-చైతన్యల పెళ్లి ముహూర్తం ఖరారు..

మెగా వారసురాలు నిహారిక కొణిదెల పెళ్లి ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9వ తేదీ రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక మెడలో చైతన్య మూడు ముళ్లు వేయనున్నారు.

నిహారిక-చైతన్యల పెళ్లి ముహూర్తం ఖరారు..

Updated on: Nov 04, 2020 | 4:27 PM

Niharika Konidela Marriage: మెగా వారసురాలు నిహారిక కొణిదెల పెళ్లి ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9వ తేదీ రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక మెడలో చైతన్య మూడు ముళ్లు వేయనున్నారు. వీరి వివాహం రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో జరగనుంది. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గుంటూరు ఐజీ జె.ప్రభాకరరావు వివాహ పత్రికను స్వామివారి చెంత ఉంచి, ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం వివాహ తేదీ, వేడుకను ఖరారు చేసినట్లు ప్రకటించారు. కాగా, ఆగష్టులో నిహారిక, చైతన్యల ఎంగేజ్మెంట్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు మెగా కుటుంబం, సన్నిహితులు హాజరయ్యారు.

Also Read: రోహిత్‌.! టీమిండియా కంటే ఐపీఎల్ ముఖ్యమా.?