నిహారిక పసుపు ఫంక్షన్.. వీడియో వైరల్

| Edited By:

Aug 18, 2020 | 10:35 AM

ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె, నటి నిహారిక కొణిదెల పెళ్లి పనులు ఊపందుకున్నాయి. శ్రావణ సోమవారం నాడు పసుపు దంచే కీలక కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ముఖ్య ఘట్టానికి మెగా కుటుంబంలోని ఆడవాళ్లందరూ హాజరయ్యారు. అలాగే నిహారిక కూడా పసుపు కొమ్ములు దంచుతూ ఫొటోలకు..

నిహారిక పసుపు ఫంక్షన్.. వీడియో వైరల్
Follow us on

ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె, నటి నిహారిక కొణిదెల పెళ్లి పనులు ఊపందుకున్నాయి. శ్రావణ సోమవారం నాడు పసుపు దంచే కీలక కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ముఖ్య ఘట్టానికి మెగా కుటుంబంలోని ఆడవాళ్లందరూ హాజరయ్యారు. అలాగే నిహారిక కూడా పసుపు కొమ్ములు దంచుతూ ఫొటోలకు ఇచ్చింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పసుపు ఫంక్షన్ వేడుక వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

కాగా ఆగష్టు 13న మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక నిశ్చితార్ధం హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోట‌ల్‌లో జరిగిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర్ రావు త‌న‌యుడు జొన్న‌ల‌గ‌డ్డ వెంక‌ట చైత‌న్య‌తో నిహారిక ఎంగేజ్‌మెంట్ ఈ రోజు పెద్ద‌ల స‌మ‌క్షంలో జ‌రిగింది. ఈ నిశ్చితార్ధం వేడుక‌కు మెగా ఫ్యామిలీ మొత్తం హాజ‌ర‌య్యారు.

Also Read:

నవంబర్ నాటికి కూడా ప్యాసింజర్ రైళ్లను నడపడం కష్టమే!

భారీ వ‌ర్షాల‌కు కూలిన రోడ్డు.. లోయ‌లో ప‌డిన వాహ‌నాలు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం