Covid19 Wave Worry: పంజాబ్‌లోని ముఖ్య నగరాలు, పట్టణాలలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు

|

Nov 25, 2020 | 3:44 PM

కరోనా వైరస్ మళ్లీ జడలు విప్పుకుంటోంది. కోవిడ్‌ నిబంధనలను ప్రజలు పట్టించుకోకపోవడం కూడా కేసులు పెరగడానికి కారణమవుతోంది.. ఢిల్లీ పరిసర ప్రాంతాలలో పెరిగిపోతున్న కేసుల కారణంగా..

Covid19 Wave Worry:  పంజాబ్‌లోని ముఖ్య నగరాలు, పట్టణాలలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు
Follow us on

కరోనా వైరస్ మళ్లీ జడలు విప్పుకుంటోంది. కోవిడ్‌ నిబంధనలను ప్రజలు పట్టించుకోకపోవడం కూడా కేసులు పెరగడానికి కారణమవుతోంది.. ఢిల్లీ పరిసర ప్రాంతాలలో పెరిగిపోతున్న కేసుల కారణంగా పక్కనే ఉన్న పంజాబ్‌ కూడా అలెర్టయ్యింది.. కోవిడ్‌పై కొత్త ఆంక్షలను అమలు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ భావిస్తున్నారు. పంజాబ్‌లో అన్ని నగరాలు, పట్టణాలలో రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇకపై అక్కడ మాస్క్‌లు ధరించని, భౌతికదూరాన్ని పాటించనివారికి భారీగా జరిమానాలు విధించబోతున్నారు. డిసెంబర్‌ ఒకటి నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి.. ఇప్పటి వరకు మాస్క్‌ ధరించకపోతే 500 రూపాయలే ఫైన్‌ వేసేవారు. ఇకపై వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆంక్షలపై డిసెంబర్‌ 15న సమీక్ష జరిపి అప్పుడు మళ్లీ ఓ నిర్ణయం తీసుకుంటారు. ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లు, పెళ్లి వేదికలు రాత్రి తొమ్మిదిన్నరకు క్లోజ్‌ చేయాల్సి ఉంటుంది.. రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము అయిదు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అలాగే కోవిడ్‌ చికిత్స కోసం ఢిల్లీ నుంచి పంజాబ్‌కు వస్తున్నవారిపై కూడా ఓ నజర్‌ వేశారు. హాస్పిటల్స్‌లో బెడ్స్‌ పెంచాల్సిందిగా సీఎస్‌ వినీ మహాజన్‌ను ఆదేశించారు. స్పెషలిస్టు, సూపర్‌ స్పెషలిస్టు, నర్సులు, పారామెడిక్స్‌ను వెంటనే రిక్రూట్‌ చేయాలని ఆరోగ్య, వైద్య విద్య శాఖలకు చెప్పారు. కరోనా పరీక్షల సామర్థ్యాన్ని ప్రతిరోజూ పాతికవేలకు పెంచాలన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్ చేప‌ట్టి, ప్ర‌తి ఒక్క‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ముఖ్యమంత్రి అమ‌రింద‌ర్ ఆదేశించారు.