ముళ్ల పొదల్లో పసికందు.. రక్షించిన స్థానికులు

|

Aug 24, 2020 | 12:22 PM

లోకం కూడా చూడని పసికందును ముళ్లపొదల్లో పడేశారు కఠినాత్ములు. పడేసింది ఎవరు ? ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు కానీ .. వనపర్తి జిల్లా అమ్మాయిపల్లి గ్రామ సమీపంలో స్థానికులకు ఓ పసికందు కనిపించింది. దీంతో పాపను అక్కున చేర్చుకుని మానవత్వాన్ని చాటారు స్థానికులు.

ముళ్ల పొదల్లో పసికందు.. రక్షించిన స్థానికులు
Follow us on

లోకం కూడా చూడని పసికందును ముళ్లపొదల్లో పడేశారు కఠినాత్ములు. పడేసింది ఎవరు ? ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు కానీ .. వనపర్తి జిల్లా అమ్మాయిపల్లి గ్రామ సమీపంలో స్థానికులకు ఓ పసికందు కనిపించింది. దీంతో పాపను అక్కున చేర్చుకుని మానవత్వాన్ని చాటారు స్థానికులు. వనపర్తి జిల్లా చిన్నంభావి మండలం అమ్మాయిపల్లి గ్రామ శివారులో స్థానికులు ఎడ్లబండి మీద వెళుతుండగా ప్రధాన రహదారి పక్కన అప్పుడే పుట్టిన పసికందు కనిపించింది. పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పసికందును చూసిన కూలీలు పాపను రక్షించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆడపిల్ల అయినందుకే ఎవరో ముళ్ల పొదల్లో పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.