YSR Congress Party: వైసీపీ నేతల్లో సరికొత్త టెన్షన్

|

Feb 14, 2020 | 7:15 PM

YCP leaders fallen under new tension: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల సందడి ప్రారంభం కాబోతుంది. తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకుందామని ఇప్పటికే నేతలు ప్లాన్‌లు ప్రారంభించారు. ఆ ప్లాన్‌లు వర్క్‌వుట్‌ చేసే పనిలో పడ్డారు. అయితే వైసీపీ నేతల ప్రణాళికలకు సీఎం జగన్‌ గట్టి షాక్ ఇచ్చారు. దీంతో వారంతా టెన్షన్‌లో పడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలను మార్చి 15లోగా నిర్వహించాలని వైసీపీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కేబినెట్‌లో నిర్ణయం […]

YSR Congress Party: వైసీపీ నేతల్లో సరికొత్త టెన్షన్
Follow us on

YCP leaders fallen under new tension: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల సందడి ప్రారంభం కాబోతుంది. తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకుందామని ఇప్పటికే నేతలు ప్లాన్‌లు ప్రారంభించారు. ఆ ప్లాన్‌లు వర్క్‌వుట్‌ చేసే పనిలో పడ్డారు. అయితే వైసీపీ నేతల ప్రణాళికలకు సీఎం జగన్‌ గట్టి షాక్ ఇచ్చారు. దీంతో వారంతా టెన్షన్‌లో పడ్డారు.

స్థానిక సంస్థల ఎన్నికలను మార్చి 15లోగా నిర్వహించాలని వైసీపీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కేబినెట్‌లో నిర్ణయం జరిగింది. దీంతో వైసీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో కసరత్తు మొదలు పెట్టారు. ఇలాంటి టైమ్‌లో వారిని ఓ అంశం టెన్షన్‌ పెడుతోంది.

ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రకటన వైసీపీ నేతలు, మంత్రులను టెన్షన్ పెడుతోందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ నేతలకు ఒకరకంగా షాక్ తగిలిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలో.. గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులు ఎవరో పార్టీయే నిర్ణయిస్తుందని వైసీపీ అధినేత, సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీయే సుప్రీం అని తెగేసి చెప్పారట.

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు గుర్రాలెవరో ఇప్పటికే తేలిపోయిందని.. అభ్యర్థుల ఎంపికపై గ్రౌండ్‌ లెవల్లో ప్రజాబలం కలిగిన నేతలెవరో సర్వే ద్వారా సెలెక్ట్‌ చేస్తామని సీఎం జగన్‌ చెప్పినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు దగ్గరగా ఉండే నేతలు, అనుకూలంగా ఉండే వారికి పార్టీ తరపున టికెట్ ఇప్పించుకునేందుకు ముఖ్యనేతలు ప్రయత్నిస్తుంటారు. ఎక్కువశాతం పోటీ చేసే అవకాశాలు కూడా వారికే వస్తుంటాయి. తమ గ్రూపు వారికి, తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవాలని సీనియర్‌ నేతలు ఆలోచన చేశారట. అయితే ఇప్పుడు సర్వే ద్వారా నిర్దారిస్తామని చెప్పడంతో సీనియర్లకు టెన్షన్‌ పట్టుకుందట.

Also read: Key point in Jagan, Amith Shah meeting agenda

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభ్యర్థులను పార్టీ అధినాయకత్వమే నిర్ణయిస్తుందని… దీనిపై సర్వే చేయించామని సీఎం జగన్ చెప్పడంతో… తాము అనుకున్న వాళ్లకు టికెట్ వస్తుందో లేదో అని పలువురు నేతలు టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. కొందరైతే… అసలు పార్టీ అధినాయకత్వం నిర్వహించిన సర్వేలో ఎవరికి మొగ్గు ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి సర్వే ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేస్తామన్న సీఎం జగన్ వ్యాఖ్యలు వైసీపీ నేతలను కొంత టెన్షన్ పెడుతున్నట్టు కనిపిస్తోంది.