కరోనా నుంచి కోలుకున్నాక రోగనిరోధక శక్తి తగ్గుతుందా..!

కోవిడ్ -19 నుంచి కోలుకున్న వారిలో కొత్త సమస్యలు మొదలవుతాయంటున్నారు చైనా పరిశోధకులు. భవిష్యత్ లో వారిలో యాంటీబాడీ స్థాయిలు తగ్గుతాయంటున్నారు

కరోనా నుంచి కోలుకున్నాక రోగనిరోధక శక్తి తగ్గుతుందా..!

Updated on: Jun 23, 2020 | 2:24 PM

కోవిడ్ -19 నుంచి కోలుకున్న వారిలో కొత్త సమస్యలు మొదలవుతాయంటున్నారు చైనా పరిశోధకులు.
భవిష్యత్ లో వారిలో యాంటీబాడీ స్థాయిలు తగ్గుతాయంటున్నారు. కరోనాపై సుదీర్ఘ పోరాటం వల్ల అవి శక్తిని కోల్పోతున్నాయని వెల్లడించారు.

ఒక చైనీస్ అధ్యయనం ప్రకారం, కరోనావైరస్ కి వ్యతిరేకంగా పోరాడిన రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గుమొఖం పడుతుందంటున్నారు. జూన్ 18 న నేచర్ మెడిసిన్‌లో ప్రచురించబడిన చాంగ్‌కింగ్ మెడికల్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. రోగలక్షణాలు ఉన్న 37 మంది కరోనా బాధితులు, రోగ లక్షణాలు లేని 37 మంది రోగులపై అధ్యయనం చేసినట్లు చాంగ్‌కింగ్ మెడికల్ యూనివర్శిటీ సైంటిస్టులు వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్నాక 2-3 నెలల్లో రోగ నిరోధకస్ధాయి బాగా పడిపోయాయని పరిశోధనల్లో నిర్ధారణ అయ్యిందన్నారు. ప్రధాన యాంటీబాడీ రకాలలో ఒకటైన ఐజిజి వల్ల మరింత క్షిణత కనిపిస్తుందంటున్నారు. దీంతో మానవుల ఇమ్యూనిటి పవర్ పై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు.