న్యూజెర్సీలో ముగ్గురు భారతీయుల అనుమానాస్పద మృతి

అమెరికాలోని న్యూజెర్సీలో ఓ భారతీయ కుటుంబం అనుమానాస్పదస్టితిలో మృతి చెందింది. తూర్పు బ్రున్‌స్విక్‌ ప్రాంతంలో నివాసముంటున్న భరత్ పటేల్ (62) ఆయన కోడలు నిషా పటేల్(33) ఎనిమిదేళ్ల మనవరాలు స్విమ్మింగ్ పూట్ మునిగి చనిపోయినట్లు అధికారులు మంగళవారం ధృవీకరించారు.

న్యూజెర్సీలో ముగ్గురు భారతీయుల అనుమానాస్పద మృతి

Updated on: Jun 24, 2020 | 9:24 PM

అమెరికాలోని న్యూజెర్సీలో ఓ భారతీయ కుటుంబం అనుమానాస్పదస్టితిలో మృతి చెందింది. తూర్పు బ్రున్‌స్విక్‌ ప్రాంతంలో నివాసముంటున్న భరత్ పటేల్ (62) ఆయన కోడలు నిషా పటేల్(33) ఎనిమిదేళ్ల మనవరాలు స్విమ్మింగ్ పూల్ లో మునిగి చనిపోయినట్లు అధికారులు మంగళవారం ధృవీకరించారు.

మంగళవారం తెల్లవారుజూమున వారి ఇంటి అవరణలోని స్విమ్మింగ్ పూల్ వద్ద భరత్ పటేల్ తో పాటు కొడలు నిషా పటేల్(33), ఎనిమిదేళ్ల చిన్నారి నిగత జీవులైన పడి ఉన్నారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్విమ్మింగ్ పూల్ మరమ్మత్తులు చేస్తుండగా విద్యుతాఘాతంతో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

అయితే, భరత్ పటేల్ గత నెలలో తూర్పు బ్రున్‌స్విక్‌ ప్రాంతంలో పాత ఇంటిని కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని 3.5 అడుగుల లోతున్న స్విమ్మింగ్ పూల్ మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. మూడు డెడ్ బాడీలను గమనించిన ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us