
యోగా డే పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ చేసిన ఓ ట్వీట్ వివాదాన్ని రాజేసింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మీ కూడా దేశ వ్యాప్తంగా యోగా డే కార్యక్రమాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో జమ్మూలోని ఆర్మీ డాగ్ స్క్వాడ్ కూడా జవాన్లతో పాటు.. క్రమశిక్షణగా యోగా ఆసనాలు వేశాయి. అయితే సైనికులు తమ శిక్షణ శునకాలతో కలిసి యోగా చేస్తున్న ఫొటోను పోస్ట్ చేసిన రాహుల్.. వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఆ ఫోటోకు “న్యూ ఇండియా” అంటూ వ్యగ్యంగా క్యాప్షన్ పెట్టారు.
రాహుల్ చేసిన ట్వీట్‌పై కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతికూలతకు మారుపేరని, మధ్యయుగాల నాటి తలాక్‌కు మద్దతివ్వడంలోనే అది కనిపించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఈ శునకాలు దేశ రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. రాహుల్ చర్యను ఖండించేందుకు తనకు మాటలు రావడం లేదని కేంద్ర మంత్రి కిరెన్ రిజీజు ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ సైనికులను అవమానించారని షాన్ వాజ్ హుస్సేన్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు గుణపాఠం చెప్పినప్పటికీ బుద్దిరాలేదన్నారు. కాంగ్రెస్ నేతల తీరు మారడం లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. కాగా అటు నెటిజన్లు కూడా రాహుల్ ట్వీట్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
New India. pic.twitter.com/10yDJJVAHD
— Rahul Gandhi (@RahulGandhi) June 21, 2019
Congress stands for negativity.
Today, their negativity was seen in their clear support to the medieval practice of Triple Talaq. Now, they mock Yoga Day and insult our forces (yet again!)
Hoping the spirit of positivity will prevail. It can help overcome toughest challenges. https://t.co/sC00yrBcpA
— Amit Shah (@AmitShah) June 21, 2019