
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ తయారీలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రపంపవ్యాప్తంగా వైద్య నిపుణులు, శాస్ర్తవేత్తలు చేస్తున్న పరిశోధనలు కొలిక్కి వస్తున్నాయి. ఇందులో రష్యా ముందడుగు వేసింది. ఆ దేశంలోని సైంటిస్టులు కరోనా డ్రగ్‌ను తయారు చేశారు. ఇందుకు గాను వారు ఇన్‌ఫ్లుయెంజా చికిత్సకు వాడే ఓ పాత ఔషధానికి మార్పులు చేసి.. కొత్తగా ఔషధాన్ని రూపొందించారు. ఇక ఆ డ్రగ్ కరోనాను నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని అక్కడి శాస్ర్తవేత్తలు వెల్లడించారు.
Favipiravir అనబడే ఓ యాంటీ వైరల్ డ్రగ్‌ను 2014లో జపాన్‌లో అప్రూవ్ చేశారు. అప్పటి నుంచి ఆ మెడిసిన్‌ను ఇన్‌ఫ్లూయెంజా చికిత్సకు ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు అదే డ్రగ్‌ను ఉపయోగించి రష్యా సైంటిస్టులు Avifavir పేరుతో మరో డ్రగ్‌ను తయారు చేశారు. ఈ డ్రగ్ కరోనాను పూర్తిగా నిరోధిస్తుందని సైంటిస్టులు చేపట్టిన క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది. దీంతో ఈ డ్రగ్ వాడకానికి రష్యా ప్రభుత్వం తాత్కాలికంగా అనుమతి కూడా ఇచ్చేసింది. దీన్ని తయారు చేసిన ఫార్మా కంపెనీ పేటెంట్ కూడా పొందింది. ఇక మెడిసిన్‌కు సంబంధించి ఈ నెలలో 60వేల యూనిట్లు సిద్ధం చేసింది సదరు ఫార్మా కంపెనీ. ఈ డ్రగ్ ను కోవిడ్ 19 రోగులకు చికిత్స అందించేందుకు ఉపయోగిస్తున్నారు.
అయితే Favipiravir డ్రగ్‌పై ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్స్ కంపెనీ కూడా మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టింది. జూలై లేదా ఆగస్టు వరకు ఆ ఫలితాలు వస్తాయని కంపెనీ ప్రతినిధుల భావిస్తున్నారు. అయితే రష్యాలో ఇప్పటికే ఆ డ్రగ్ సమర్థవంతంగా పనిచేస్తునందున.. భారత్‌లోనూ అలాంటి ఫలితాలే వస్తాయని ఆశిస్తున్నారు. అదే జరిగితే.. ప్రపంచ దేశాలన్నింటిలోనూ రష్యా తరువాత కోవిడ్ 19 డ్రగ్‌ను తయారు చేసిన దేశంగా భారత్ నిలుస్తుంది. ఆ డ్రగ్ కొత్తదేమీ కాదు కనుక.. దానిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఏర్పడే అవరోధాలు అన్నీ తొలగిపోయాయంటున్నారు వైద్య నిపుణులు. దీంతో ఒకేసారి ఫేజ్-3 ట్రయల్స్ కూడా చేపట్టారు. ఇప్పటికే పేషెంట్లకు ఇచ్చి పరీక్షిస్తున్నారు. ఇక
ఫలితాలు వస్తే.. మన దేశంలోనూ కోవిడ్ 19 మెడిసిన్‌ను తయారికి మార్గం సుగమం అవుతుంది. అన్నీ ఓకే అయితే.. ఆగస్టు కల్లా భారత్‌లో కోవిడ్ 19కు మెడిసిన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు.