కరోనా నియంత్రణపై.. మోదీతో చర్చించిన ఇజ్రాయిల్ ప్రధాని

కోవిద్ 19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. మహమ్మారి కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు సామాజిక దూరం పాటించడమే మార్గమని భారత ప్రభుత్వం దేశంలో 21 రోజుల లాక్ డౌన్ విధించింది. అయితే, కోవిద్-19 మహమ్మారిని ఎదుర్కోవటానికి ఇరు దేశాల మధ్య సహకారం గురించి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ లో మాట్లాదారు. ఇరు దేశాలు తమ సాంకేతిక […]

కరోనా నియంత్రణపై.. మోదీతో చర్చించిన ఇజ్రాయిల్ ప్రధాని

Edited By:

Updated on: Apr 03, 2020 | 9:55 PM

కోవిద్ 19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. మహమ్మారి కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు సామాజిక దూరం పాటించడమే మార్గమని భారత ప్రభుత్వం దేశంలో 21 రోజుల లాక్ డౌన్ విధించింది. అయితే, కోవిద్-19 మహమ్మారిని ఎదుర్కోవటానికి ఇరు దేశాల మధ్య సహకారం గురించి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ లో మాట్లాదారు. ఇరు దేశాలు తమ సాంకేతిక సహకారాన్ని మరింతగా పెంచుకోగల మార్గం గురించి కూడా వారు చర్చించారు. ఇజ్రాయెల్‌లో 7,000 కోవిడ్ -19 కేసులు ఉండగా, భారత్‌లో 2,500 కి పైగా కేసులు నమోదయ్యాయి.