గొప్ప స్నేహితుడ్ని కోల్పోయాం..

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మరణంపట్ల ప్రపంచ దేశాధినేతలు సంతాపం తెలియజేస్తున్నారు.  తాజాగా నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ప్రణబ్ మరణంపట్ల ఆయన సంతాపం...

గొప్ప స్నేహితుడ్ని కోల్పోయాం..

Edited By:

Updated on: Sep 15, 2020 | 8:16 PM

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మరణంపట్ల ప్రపంచ దేశాధినేతలు సంతాపం తెలియజేస్తున్నారు.  తాజాగా నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ప్రణబ్ మరణంపట్ల ఆయన సంతాపం తెలిపారు. నేపాల్ గొప్ప స్నేహితుడ్ని కోల్పోయిందని పేర్కొన్నారు.  భారత్, నేపాల్ మధ్య సంబంధాల బలోపేతానికి ప్రణబ్ చేసిన కృషిని తాము ఎప్పటికీ గుర్తుచేసుకుంటామన్నారు. ఆయన మరణవార్త తనను బాధకు గురిచేసిందని కేపీ శర్మ ఓలి అన్నారు. భారత ప్రభుత్వం, భారతీయులు, ప్రణబ్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతునట్లు ట్వీట్ చేశారు.