రోడ్డుపై కానిస్టేబుల్స్ ఫైటింగ్..ఎస్పీ ఏం చేశారంటే..?

| Edited By: Anil kumar poka

Mar 29, 2020 | 4:32 PM

ఏపీలో లాక్‌డౌన్ సమయంలో పోలీసుల ప్ర‌వ‌ర్త‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌ట‌కే అతి చేసిన కొంద‌రు ఖాకీల‌పై వేటు కూడా వేశారు డీజీపీ. ప‌ద్ద‌తి త‌ప్పితే క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని హెచ్చ‌రించారు. తాజాగా నెల్లూరులో కానిస్టేబుళ్ల మధ్య గొడవ వ్యవహారంపై జిల్లా పోలీస్ బాస్ సీరియ‌స్ అయ్యారు. కానిస్టేబుల్స్ రోడ్డుపై గొడవ ప‌డి..డిపార్ట్ మెంట్ దిగ‌జార్చ‌డంపై ఎస్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులును వెంట‌నే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సీఐ, […]

రోడ్డుపై కానిస్టేబుల్స్ ఫైటింగ్..ఎస్పీ ఏం చేశారంటే..?
Follow us on

ఏపీలో లాక్‌డౌన్ సమయంలో పోలీసుల ప్ర‌వ‌ర్త‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌ట‌కే అతి చేసిన కొంద‌రు ఖాకీల‌పై వేటు కూడా వేశారు డీజీపీ. ప‌ద్ద‌తి త‌ప్పితే క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని హెచ్చ‌రించారు. తాజాగా నెల్లూరులో కానిస్టేబుళ్ల మధ్య గొడవ వ్యవహారంపై జిల్లా పోలీస్ బాస్ సీరియ‌స్ అయ్యారు. కానిస్టేబుల్స్ రోడ్డుపై గొడవ ప‌డి..డిపార్ట్ మెంట్ దిగ‌జార్చ‌డంపై ఎస్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులును వెంట‌నే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సీఐ, ఎస్ఐలకి ఛార్జి మెమోలు జారీ చేశారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. నెల్లూరులోని ఇరుకళలమ్మ గుడి వద్ద‌కు ఓ యువకుడు బైక్‌పై వచ్చాడు. లాక్‌డౌన్ పైగా రాత్రి సమయం కావడంతో.. అక్కడే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ అత‌డికి లాఠీతో దేహ‌శుద్ది చేసి.. బైక్ కీస్ లాక్కున్నాడు. దీంతో ఆ యువకుడు ఏఆర్ కానిస్టేబుల్ అయిన త‌న తండ్రికి ఫోన్ చేసి కొట్టిన విష‌యాన్ని చెప్పాడు. వెంట‌నే అక్క‌డికి చేర‌కున్న ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాసులు..తీవ్ర ఆగ్ర‌హంతో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ను దుర్భాషలాడ‌టంతో పాటు దాడికి య‌త్నించాడు. అతడి కాల‌ర్ పట్టుకొని గొడవకు దిగాడు. దీంతో అక్క‌డ ఉన్న స్థానికులు వారిని విడదీశారు. ఈ ఘ‌ట‌న‌ను అక్క‌డే ఉన్న కొంద‌రు ఫోన్ల‌లో చిత్రీక‌రించ‌డంతో..ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. విష‌యం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో, . కానిస్టేబుల్ శ్రీనివాసులును సస్పెండ్ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.