మ్యారేజీ లైఫ్ సంతోషంగా లేదు.. అందుకే

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ అనుమానాస్పద మృతి కేసులో ఆయన భార్య అపూర్వ తివారీని పోలీసులు అరెస్ట్ చేశారు. రోహిత్ మరణం తరువాత మూడు రోజుల పాటు అపూర్వను విచారించిన పోలీసులు, ఆమెనే నిందితురాలని నిర్ధారించారు. ఈ నెల 16న రోహిత్‌ మరణించాడు. మొదట ఆయన మరణాన్ని అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు.. తమ దర్యాప్తును వేగవంతం చేయడంతో అసలు నిందితురాలు ఆయన భార్యేనని తేలింది. కాగా తమ వైవాహిక జీవితం […]

మ్యారేజీ లైఫ్ సంతోషంగా లేదు.. అందుకే

Edited By:

Updated on: Apr 24, 2019 | 4:47 PM

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ అనుమానాస్పద మృతి కేసులో ఆయన భార్య అపూర్వ తివారీని పోలీసులు అరెస్ట్ చేశారు. రోహిత్ మరణం తరువాత మూడు రోజుల పాటు అపూర్వను విచారించిన పోలీసులు, ఆమెనే నిందితురాలని నిర్ధారించారు. ఈ నెల 16న రోహిత్‌ మరణించాడు. మొదట ఆయన మరణాన్ని అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు.. తమ దర్యాప్తును వేగవంతం చేయడంతో అసలు నిందితురాలు ఆయన భార్యేనని తేలింది. కాగా తమ వైవాహిక జీవితం సంతోషంగా లేదని, తరచూ తనతో రోహిత్ ఘర్షణ పడేవాడని చెప్పిన అపూర్వ.. తన కలలు కల్లలయ్యాయని వాపోయింది. రోహిత్‌ను హతమార్చిన తరువాత అపూర్వ గంటన్నరలో సాక్షాధారాలను మాయం చేసిందని పోలీసులు వెల్లడించారు.