Lucifer Telugu Remake: ‘లూసీఫర్’ తెలుగు రీమేక్‌.. చిరంజీవితో జత కట్టనున్న లేడి సూపర్ స్టార్..?

Lucifer Telugu Remake: మెగాస్టార్ చిరంజీవి వరుసపెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒకవైపు ఆచార్య షూటింగ్‌లో బిజీగా ఉన్న చిరు....

Lucifer Telugu Remake: లూసీఫర్ తెలుగు రీమేక్‌.. చిరంజీవితో జత కట్టనున్న లేడి సూపర్ స్టార్..?

Updated on: Jan 04, 2021 | 8:09 PM

Lucifer Telugu Remake: మెగాస్టార్ చిరంజీవి వరుసపెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒకవైపు ఆచార్య షూటింగ్‌లో బిజీగా ఉన్న చిరు.. మరో రెండు సినిమాలకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి ‘వేదాళం’ రీమేక్ కాగా.. మరొకటి మలయాళం హిట్ మూవీ ‘లూసీఫర్’ తెలుగు రీమేక్.

ఇదిలా ఉంటే తాజాగా ‘లూసీఫర్’ తెలుగు రీమేక్‌కు దర్శకుడు ఖరారు అయ్యాడు. ‘తనిఒరవన్’ ఫేం మోహన్‌రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇక తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో ముఖ్యమంత్రి కూతురు పాత్రలో నయనతార కనిపించనుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆమెతో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపిందని వినికిడి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అటు యంగ్ హీరో సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనుండగా.. ఈ చిత్రం షూటింగ్ జనవరి 20 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.