ఐసిస్‌తో హైదరాబాద్ యువకుడికి లింక్..

|

Sep 03, 2020 | 12:30 PM

యువకుడితోపాటు మరో నలుగురిపై కూడా జాతీయ దర్యాప్తు సంస్థ ( NIA) ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. నిందితుల్లో హైదరాబాద్‌కు చెందిన యువకుడు కూడా ఉన్నాడని తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఢిల్లీ న్యాయస్థానంలో ఛార్జిషీట్‌ సమర్పించినట్టు ఎన్‌ఐఏ అధికారి వెల్లడించారు.

ఐసిస్‌తో హైదరాబాద్ యువకుడికి లింక్..
Follow us on

టెర్రర్ లింక్‌తో మరోసారి హైదరాబాద్ వార్తల్లోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన యువకుడికి  కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ (ISIS‌)కు అనుబంధ సంస్థ ‘ఇస్లామిక్‌ స్టేట్‌ ఖోరాసన్‌ ప్రావిన్స్‌’తో సంబంధాలున్నట్లుగా తేలింది. ఈ యువకుడితోపాటు మరో నలుగురిపై కూడా జాతీయ దర్యాప్తు సంస్థ ( NIA) ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. నిందితుల్లో హైదరాబాద్‌కు చెందిన యువకుడు కూడా ఉన్నాడని తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఢిల్లీ న్యాయస్థానంలో ఛార్జిషీట్‌ సమర్పించినట్టు ఎన్‌ఐఏ అధికారి వెల్లడించారు.

ఢిల్లీ నివాసులైన జహాన్‌ఝాయిబ్‌ సమీ, హీనా బషీర్‌ దంపతులతో పాటు… హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్లా బాసిత్‌, పుణెకు చెందిన సదియా అన్వర్‌ షేక్‌, నబీస్‌ సిద్ధిక్‌ ఖత్రిలను అధికారులు ఇందు కీలక నిందితులుగా పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థతో కలిసి… వివిధ మతాలవారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్రోహ చర్యలకు దిగడం, జనసమ్మర్ద ప్రదేశాల్లో పేలుళ్లకు పాల్పడటం వంటి లక్ష్యాలతో వీరు పనిచేస్తున్నట్టు అధికారులు ఆరోపించారు.

ఇస్లామిక్‌ స్టేట్‌కు చెందిన ‘సావత్‌ అల్‌-హింద్‌..  వాయిస్‌ ఆఫ్‌ ఇండియాగా మరోపేరు. ’ మ్యాగజైన్‌ ఫిబ్రవరి-2020 సంచికను వీరు ప్రచురించారు. దీంతో మార్చి 8న ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో, అసలు ఉగ్ర కోణం బయటకొచ్చింది.