ఫ్రాన్స్ లో ఉగ్రదాడికి నసీరుద్దీన్ షాతో సహా 100 మంది ఖండన

| Edited By: Pardhasaradhi Peri

Nov 01, 2020 | 7:47 PM

ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రదాడిని ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షాతో బాటు 100 మందికి పైగా సెలబ్రిటీలు, ప్రొఫెసర్లు, మేధావులు ఖండించారు. వీరిలో లాయర్ ప్రశాంత్ భూషణ్, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ మల్లికా సారాభాయ్ తదితరులు ఉన్నారు. తోటి మానవులను చంపడాన్ని ఏ  దేవుడూ, దేవతలూ, ప్రవక్తలూ క్షమించబోరని వీరు ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. విశ్వాసం పేరిట అమాయకులను హతమార్చడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించే ప్రసక్తి లేదని, ఇండియన్ ముస్లిములకు తాము గార్డియన్లని చెప్పుకుంటున్నవారు చేసిన ఈ […]

ఫ్రాన్స్ లో ఉగ్రదాడికి నసీరుద్దీన్ షాతో సహా 100 మంది ఖండన
Follow us on

ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రదాడిని ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షాతో బాటు 100 మందికి పైగా సెలబ్రిటీలు, ప్రొఫెసర్లు, మేధావులు ఖండించారు. వీరిలో లాయర్ ప్రశాంత్ భూషణ్, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ మల్లికా సారాభాయ్ తదితరులు ఉన్నారు. తోటి మానవులను చంపడాన్ని ఏ  దేవుడూ, దేవతలూ, ప్రవక్తలూ క్షమించబోరని వీరు ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. విశ్వాసం పేరిట అమాయకులను హతమార్చడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించే ప్రసక్తి లేదని, ఇండియన్ ముస్లిములకు తాము గార్డియన్లని చెప్పుకుంటున్నవారు చేసిన ఈ దారుణాన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని వీరన్నారు. ఉగ్రదాడిలో మృతి చెందినవారికి సంతాప సూచనగా ఫ్రాన్స్ లోని ముస్లిములు మహమ్మద్ ప్రవక్త జయంతి సెలబ్రేషన్స్ ని రద్దు చేసుకోవాలని వీరు కోరారు.