సినిమా చూపిస్త మామ.. ఎప్పుడంటే!

|

May 03, 2019 | 4:59 PM

ఎట్టకేలకు ‘పీఎం నరేంద్ర మోదీ’ బయోపిక్‌కు విడుదల తేదీ ఖరారైంది. మే 23న ఎన్నికల ఫలితాల విడుదల మరునాడే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈమేరకు నిర్మాతల్లో ఒకరైన సందీప్ సింగ్ మీడియాకు వెల్లడించారు. మరోవైపు ఈ సినిమా ముందుగా ఏప్రిల్ 11న విడుదల చేయాలనుకుంటే ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో విడుదల ఆగిపోయింది. దీనిపై చిత్ర నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించినా.. వారికి ఫలితం దక్కలేదు. ఇలా మొత్తం మీద అనేక పరిణామాల […]

సినిమా చూపిస్త మామ.. ఎప్పుడంటే!
Follow us on

ఎట్టకేలకు ‘పీఎం నరేంద్ర మోదీ’ బయోపిక్‌కు విడుదల తేదీ ఖరారైంది. మే 23న ఎన్నికల ఫలితాల విడుదల మరునాడే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈమేరకు నిర్మాతల్లో ఒకరైన సందీప్ సింగ్ మీడియాకు వెల్లడించారు.

మరోవైపు ఈ సినిమా ముందుగా ఏప్రిల్ 11న విడుదల చేయాలనుకుంటే ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో విడుదల ఆగిపోయింది. దీనిపై చిత్ర నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించినా.. వారికి ఫలితం దక్కలేదు. ఇలా మొత్తం మీద అనేక పరిణామాల తర్వాత చిత్రాన్ని ఎన్నికల  ఫలితాల మరుసటి రోజు విడుదల చేయనున్నారు. ఈసారైనా మూవీ ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదలవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు నిర్మాత సందీప్ సింగ్. కాగా ఈ సినిమాలో మోదీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించిన విషయం తెలిసిందే.