రూ. 100కే నాలుగు కేజీల చికెన్..!

|

Mar 09, 2020 | 2:10 PM

కరోనావైరస్ ప్రభావంతో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. పౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వదంతుల కారణంగా చికెన్ షాపు వైపు వెళ్లేందుకు కూడా జనం జంకుతున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ స్వయంగా వచ్చి..లైవ్‌లో చికెన్ తిని కరోనాకు, చికెన్‌కు సంబంధం లేదని చెప్పినప్పటికి  జనాల్లో మార్పు కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ ప్రభావంతో రూ. 2000 కోట్ల నష్టం వాటిల్లినట్టు వార్తలు వెలువడుతున్నాయి. చికెన్ కొనడానికి ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లా […]

రూ. 100కే నాలుగు కేజీల చికెన్..!
Follow us on

కరోనావైరస్ ప్రభావంతో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. పౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వదంతుల కారణంగా చికెన్ షాపు వైపు వెళ్లేందుకు కూడా జనం జంకుతున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ స్వయంగా వచ్చి..లైవ్‌లో చికెన్ తిని కరోనాకు, చికెన్‌కు సంబంధం లేదని చెప్పినప్పటికి  జనాల్లో మార్పు కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ ప్రభావంతో రూ. 2000 కోట్ల నష్టం వాటిల్లినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

చికెన్ కొనడానికి ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్‌లో చికెన్ షాపు నిర్వాహకుడు వినూత్న ప్రచారం చేశాడు. కేవలం 100 రూపాయలకే రెండు 4 కేజీలు బరువు తూగే 2 కోళ్లు అమ్ముతూ..కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు. కోళ్లకు కరోనావైరస్ ఉండదని చాటి చెప్పేందకే ఈ తరహా అమ్మకాలు చేపట్టినట్టు షాపు యజమాని తెలిపాడు. ఈ రకంగా చూస్తే కిలో మాసం రూ. 25 కే వచ్చినట్టవుతుంది. ఈ క్రేజీ ఆఫర్‌తో సదరు చికెన్ షాపుకు క్యూ కట్టారు మాంసం ప్రియులు.