ఆటో – డీసీఎం వ్యాన్ ఢీ.. ఒకరు మృతి.. 16 మందికి గాయాలు

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిడమనూరు మండలం బొక్కముంతలపాడు వద్ద డీసీఎం వ్యాను ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఆటో - డీసీఎం వ్యాన్ ఢీ.. ఒకరు మృతి.. 16 మందికి గాయాలు

Updated on: Jun 24, 2020 | 10:42 PM

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిడమనూరు మండలం బొక్కముంతలపాడు వద్ద డీసీఎం వ్యాను ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. త్రిపురారం మండలం కంపసాగర్‌ కు చెందిన బంధుమిత్రులు నిడమనూరు మండలం ఇబ్రహీంపట్నం లో జరిగిన ఒక శుభకార్యానికి వెళ్లి వస్తుందగా ఈ ప్రమాదంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి కంపసాగర్ కు చెందిన దైద సైదులుగా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు సహాయక చర్యలు చేపట్టారు.