పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ బేస్ ఎంతో అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదు. పవర్ స్టార్ కు సంబంధించి ఏ మూవీ అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ రచ్చ లేపుతారు. అలాంటి ఫ్యాన్స్‌కి పవన్ రేర్ ఫొటో దొరికితే ఊరుకుంటారా. రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో సదరు ఫోటోను తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఫొటోలో పవన్ కల్యాణ్ యువకుడిగా, నూనూగు మీసాలతో కనిపిస్తున్నారు. ఫ్యాన్స్ అయితే ఈ ఫొటోని చెగువేరాతో పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ ఫొటో గురించి మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు ”ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయి.., నా దగ్గర.. దాచానంతే… ! ఫరెవర్ బెస్ట్ బ్రదర్.. ఫరెవర్ లవ్.. పవన్ కల్యాణ్” అని పోస్ట్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ నాగబాబుకి రిక్వెస్ట్‌లు మొదలెట్టారు. దయచేసి వాటిని ఒక్కొక్కటిగా రివీల్ చెయ్యండి సార్.. అంటూ ఆశగా అడుగుతున్నారు. మరి ఫ్యాన్స్ కోరికను నాగబాబు నెరవేరుస్తాడో.. లేదో.. చూడాలి.
Also Read :
దొంగతనానికి వచ్చి, గురకపెట్టి నిద్రపోయాడు
“వెయిటర్‌గా పనిచేస్తున్నప్పుడు, టిప్పుగా ఓ మహిళ కిస్ పెట్టింది”