దేశవ్యాప్తంగా కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. అంతర్జాతీయంగా పర్యాటక రంగం కుప్పకూలింది. ఈ క్రమంలో కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్‌ను గురువారం మూసివేశారు. ప్యాలెస్‌లో పనిచేసే ఉద్యోగి బంధువుకు కరోనా పాజిటివ్ రావడంతో మూసివేసినట్లు ప్రకటించారు. మళ్లీ సోమవారం మైసూర్ ప్యాలెస్‌ను తెరిచే అవకాశమున్నట్లు తెలిసింది. కాగా.. కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం గమనార్హం.
కోవిద్-19 కట్టడి కోసం కర్ణాటక ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అయినా కూడా రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,228 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 1,373 కేసులు బెంగళూరులోనే నమోదు కావడం గమనార్హం. మరణాల సంఖ్య కూడా కొంత ఆందోళనకరంగానే ఉంది. గత 24 గంటల్లో కర్ణాటకలో కరోనా వల్ల 17 మంది మరణించారు. దీంతో.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 486కు చేరింది.
Also Read: బాయ్‌కాట్ చైనీస్ యాప్స్: భారత్ బాటలో.. అమెరికా.. ఆస్ట్రేలియా..