బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అభిమానిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌ను బెదిరించిన కేసులో వ్యక్తిని గురువారం రాత్రి ముంబై పోలీసులు కోల్‌కతాలో అరెస్టు చేశారు. దక్షిణ కోల్‌కతాలోని టోలీగంగే ప్రాంతానికి చెందిన పలాశ్ బోస్ ఇటీవల సంజయ్ రౌత్‌కు ఫోన్ చేసి తీవ్రంగా బెదిరించాడు. దీంతో కేసు నమోదు చేసిన మంబై పోలీసులు పలాశ్ బోస్ నివాస ప్రాంతాన్ని గుర్తించి కోల్‌కతా పోలీసుల సాయంతో అరెస్టు చేశారు. ట్రాన్సిట్ రిమాండ్ కోసం అతన్ని కోర్టులో హాజరుపర్చినట్లు పోలీసులు తెలిపారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై అనుమానాస్పద కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు చేయడంపై కంగనా రనౌత్, మహారాష్ట్ర అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ముంబైను పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చిన కంగనా రనౌత్ శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను మహారాష్ట్రకు తిరిగి రావొద్దంటూ సంజయ్ రౌత్ తోపాటు పలువురు ఆ పార్టీ నాయకులు హెచ్చరించారు. అయితే, ఎంపీ సంజయ్ రౌత్ కి పలాశ్ బోస్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఎంపీతో పాటు మరికొందరు శివసేన నేతలకు ఫోన్ కాల్ చేసి బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతన్ని పక్కాగా నిఘా పెట్టిన పోలీసులు అరెస్ట్ చేశారు.