Mukesh Ambani is Now 4th Richest Man in World : భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ మరో రికార్డును సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో తాజాగా ఆయన నాలుగో స్థానంను దక్కించుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముకేష్ అంబానీ.. అమెజాన్ అధినేత జేఫ్ బెజోస్, బిల్ గేట్స్, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ వరుసగా ఆ తర్వాత స్థానంలో ఉన్నారు.
ఈ ఇండెక్స్‌లో ముకేష్ అంబానీ సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు సంపదతో ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్డ్‌ను బీట్ చేసి ఫోర్త్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. ఇంత కాలం ఈ ఇండెక్స్ లో కేవలం అమెరికన్లు మాత్రమే దక్కించుకునేవారు. అయితే బెజోస్, బిల్ గేట్స్, గూగుల్ అధినేతలు సెర్గీ, లారీ పేజ్, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ తర్వాత స్థానంలో ఉన్నారు. తాజాగా వారి జాబితాలో ముకేష్ అంబానీ చేరారు. బ్లూమ్‌బర్గ్ వెల్లడించిన నివేదికలో 10 మంది ప్రపంచ కుబేరుల్లో 8 మంది అమెరికాకు చెందిన వారే కావడం గమనార్హం. వీరి సరసన చేరిన ముకేష్ అంబానీ భారత్ నుంచే కాక ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు.