MS Raju: నమ్రతా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌పై హర్ట్‌ అయిన ఎమ్‌ఎస్‌ రాజు… తన పేరు ప్రస్తావించకపోవడంతో…

MS Raju Reaction On Namrata Post: టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబు కెరీర్‌లో 'ఒక్కడు' చిత్రానికి ఉన్న స్థానం ఎంతో ప్రత్యేకమైంది. అప్పటి వరకు లవర్‌ బాయ్‌ ఇమేజ్‌తో ఉన్న మహేష్‌ను ఈ సినిమా మాస్‌ ప్రేక్షకులకు దగ్గరచేసింది...

MS Raju: నమ్రతా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌పై హర్ట్‌ అయిన ఎమ్‌ఎస్‌ రాజు... తన పేరు ప్రస్తావించకపోవడంతో...

Edited By:

Updated on: Jan 16, 2021 | 9:17 AM

MS Raju Reaction On Namrata Post: టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబు కెరీర్‌లో ‘ఒక్కడు’ చిత్రానికి ఉన్న స్థానం ఎంతో ప్రత్యేకమైంది. అప్పటి వరకు లవర్‌ బాయ్‌ ఇమేజ్‌తో ఉన్న మహేష్‌ను ఈ సినిమా మాస్‌ ప్రేక్షకులకు దగ్గరచేసింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పటికీ ఓ సంచలనం.

ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలై శుక్రవారం (జనవరి15) నాటికి 18 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నెట్టింట్లో ‘ఒక్కడు’ పోస్టర్లు హల్చల్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మహేష్‌ సతీమణి నమ్రత చేసిన పోస్ట్‌ ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఒక్కడు సినిమా పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన నమ్రత.. ‘మహేష్ సినిమాల్లో ఒక్కడు ఒక క్లాసిక్‌ సినిమా. ఇది మళ్లీ మళ్లీ చూడలనిపించే సినిమా.. ఒక్కడు నాకు ఆల్‌ టైమ్‌ ఫేవరేట్‌ సినిమా. కాలంతో పాటు ఈ సినిమా వన్నె ఇంకా పెరుగుతూనే ఉంది’ అంటూ క్యాప్షన్‌ జోడించింది. ఈ పోస్టులో.. చిత్ర యూనిట్‌ సభ్యులైన.. మహేష్, భూమిక, గుణశేఖర్, ప్రకాష్ రాజ్, ఫైట్ మాస్టర్ విజయన్, మణిశర్మ ఇలా అందరి పేర్లను ప్రస్తావించింది నమ్రత. అయితే వీరిలో నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజును మాత్రం మర్చిపోయింది.

దీంతో ఈ విషయాన్ని గమనించిన ఎమ్‌ఎస్‌ రాజు ట్విట్టర్‌ వేదికగా ఓ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌లో ఆయన స్పందిస్తూ.. ‘పొరపాట్లు జరుగుతుంటాయి బాబు. నమ్రతగారు ఒక్కడు గురించి మాట్లాడుతూ నా పేరును మర్చిపోయారు. అయినా నాకు సంతోషమే. ఈ సినిమా ఆమెకు ఫెవరెట్ మూవీ. గుడ్ లక్’ అంటూ ట్వీట్ పెట్టి మహేష్ బాబును ట్యాగ్ చేశారు. ఎమ్‌ఎస్‌ రాజు ట్వీట్‌పై నమ్రత ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read: Sashi Movie : ఫిబ్ర‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆది సాయి కుమార్ ‘శశి’..