
క్లాసిక్ చిత్రాల దర్శకుడు.. నో కాంప్రమైజ్ అంటున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకునే సినిమాలు తీసిన రాజుగారు ఇప్పుడు మాత్రం కేరాఫ్ కాంట్రవర్సీ అయ్యారు. లాంగ్ గ్యాప్ తరువాత తన ఇమేజ్‌కు ఏ మాత్రం సింక్ అవ్వని సబ్జెక్ట్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చారు ఎంఎస్ రాజు. అదే.. డర్టీ హరి మూవీతో. బోలెడంత ఇమేజ్ ఉన్న ప్రొడ్యూసర్… మరీ ఇంత బోల్డ్ కంటెంట్‌తో సినిమా చేయటం ఏంటా… అని ఇండస్ట్రీ జనాలు కూడా చెవులు కొరుక్కుంటున్నారు. ఈ విషయంలో రాజుగారు మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. నేను కూడా అప్‌డేట్ అయ్యాను. చెప్పదలుచుకున్న కంటెంట్ నా ఇమేజ్‌కు తగ్గదే.. కాకపోతే ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా చెప్పానంతే అంటూ కుండబద్దలు కొట్టేశారు.
మీరేంటి.. ఇలాంటి సినిమాలు తీయటం ఏంటి.. అంటూ సోషల్ మీడియాలో ఒక అభిమాని ఆవేదనతో చేసిన ఓ కామెంట్‌కు ఇలా.. గట్టిగా.. కాన్ఫిడెంట్‌గా కౌంటర్ ఇచ్చారు మిస్టర్ ఎమ్‌ఎస్. ఇంకెన్నాళ్లు ఆ సుత్తి సినిమాలు తీసేది.. నేను మారాను.. మీరూ మారండి అని ఫ్యాన్స్‌కు లైట్‌గా క్లాస్ కూడా తీసుకున్నారు ఎంఎస్ రాజు.
Also Read :
మెడిసిన్ ఇచ్చి ఆదుకున‌్న భారతం..మన వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల ఆరాటం