ఏపీ పోలీసులకు చేత కాకుంటే సీబీఐ దర్యాప్తు ఎలా ఉంటుందో చూపెడతాం.. డీజీపీ వ్యాఖ్యలపై బీజేపీ ముప్పేట దాడి

|

Jan 21, 2021 | 11:25 AM

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై బీజేపీ నేతలు ముప్పేట దాడిని పెంచారు. ఆలయాలపై దాడి వెను బీజేపీ నేతల హస్తం ఉందన్న..

ఏపీ పోలీసులకు చేత కాకుంటే సీబీఐ దర్యాప్తు ఎలా ఉంటుందో చూపెడతాం.. డీజీపీ వ్యాఖ్యలపై బీజేపీ ముప్పేట దాడి
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై బీజేపీ నేతలు ముప్పేట దాడిని పెంచారు. ఆలయాలపై దాడి వెను బీజేపీ నేతల హస్తం ఉందన్న డీజీపీ ప్రకటనపై కమలనాథులు కస్సుమంటున్నారు. విగ్రహాల ధ్వంసంపై వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా డీజీపీ మాట మార్చారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ అన్నారు.

డీజీపీ సవాంగ్‌ ద్వంద్వ వ్యాఖ్యలపై పార్లిమెంట్‌లో ఫిర్యాదు చేసి, ప్రివిలైజ్ మోషన్ పెడతామని సీఎం సీఎం రమేష్‌ తెలిపారు. ఏపీలో బీజేపీ నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు.

సోము వీర్రాజు ఇంటి వద్ద పోలీసులను ఎందుకు పెట్టారని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. డీజీపీ తన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. డీజీపీ వివరణ ఇవ్వక పోతే బీజేపీ ఆందోళన ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఏపీ పోలీసులకు చేత కాదు అని అంగీకరిస్తే.. సీబీఐ దర్యాప్తు ఎలా ఉంటుందో చూపెడతామని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.