మధ్యప్రదేశ్ బైపోల్స్, బీజేపీ అభ్యర్థి ఇమర్తి దేవి ఓటమి

మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో డాబ్రా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇమర్తీ దేవి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ రాజే చేతిలో ఆమె 7265 ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు. ఈ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఈమెను ఉద్దేశించి ‘ఐటెం’ అంటూ చేసిన అనుచిత వ్యాఖ్య పెను దుమారం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీలో సుమారు 23 ఏళ్లపాటు కొనసాగిన ఈమె గత మార్చిలో బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా […]

మధ్యప్రదేశ్ బైపోల్స్, బీజేపీ అభ్యర్థి ఇమర్తి దేవి ఓటమి

Edited By:

Updated on: Nov 11, 2020 | 4:23 PM

మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో డాబ్రా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇమర్తీ దేవి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ రాజే చేతిలో ఆమె 7265 ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు. ఈ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఈమెను ఉద్దేశించి ‘ఐటెం’ అంటూ చేసిన అనుచిత వ్యాఖ్య పెను దుమారం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీలో సుమారు 23 ఏళ్లపాటు కొనసాగిన ఈమె గత మార్చిలో బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా సూచనపై  బీజేపీలో చేరారు.